గ్రామాభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి ,జీవన్గి సర్పంచ్ రామాని బసప్ప
బషీరాబాద్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30): గ్రామ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జీవన్గి గ్రామ సర్పంచ్ రామాని బసప్ప తెలిపారు. తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచ్ రామాని బసప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారం, మార్గదర్శకంతో జీవన్గి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ అనుచరులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ కాశీం పాషా.