BREAKING
స్వచ్ఛ మారథాన్‌తో విజయవాడలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గం మనందరికీ ఆదర్శం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఘన స్వాగతం ఉయ్యాలలో ఊగిన కోతి.. ఆశ్చర్యపోయిన గ్రామస్థులు మహాత్ముల జీవితాలు ఆదర్శణీయం - ఏపిసిసి మీడియా ఛైర్మన్ డా.తులసిరెడ్డి రిలయన్స్ అధినేత అనంత్ అంబానీకి ఘన స్వాగతం కేవలం ఉత్సవాలకే పరిమితం కాదు.. ప్రజాస్వామ్యానికి గాంధీ ఆలోచనలు నేడు అత్యంత ఆవశ్యకం: రాజ్ థాకరే కీలక వ్యాఖ్యలు మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జనసేన నేత గురాన అయ్యలు గాంధీజీ చూపిన మార్గాలు కొణిదల పవన్, నారా లోకేష్ కు ఘన స్వాగతం పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోడీ ఫోన్: ఆరోగ్య పరిస్థితిపై పరామర్శ, ధైర్యసాహసాలకు ప్రశంసలు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తేదీని 'పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం'గా పాటించాలి హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి

Select Suryaa Now
గాంధీజీ ఆశయాల సాధనకు కృషి చేయాలి

సూర్య, పెంచికల్‌పేట్;పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సముద్రాల రాజన్న మాట్లాడుతూ సత్యం, అహింస మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సమైక్యతను కాపాడుతూ గాంధీజీ చూపిన మార్గంలో నడవాలని అన్నారు.అనంతరం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన శాంతి, అహింస మార్గంలో నడిస్తే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాచకొండ కృష్ణ, రాచకొండ రాజు, బీఆర్‌ఎస్ నాయకులు పుల్లూరి రామన్న, బీజేపీ నాయకులు గణపురం నాగేష్, పెద్ది సంతోష్, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు ఘనపురం వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాచకొండ శ్రీకృష్ణతో పాటు నాయకులు రావుల కృష్ణ, భాస్కర్, సత్యనారాయణ, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.