BREAKING
త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి. టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల అద్భుత సినీ ప్రస్థానం.. నటుడిగా, నాయకుడిగా ప్రత్యేక ప్రయాణం! రక్తదానం చేస్తే ప్రాణదానం చేసినట్లే ప్రజా సమస్యలు పరిష్కార వేదికకు ప్రభుత్వం ప్రాధాన్యం ఏపీ స్థానిక ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు: బీసీలకు 5, ఎస్సీలకు 2, ఎస్టీలకు 1 స్థానం కేటాయింపు 'గోల్డ్ స్పాట్' నుంచి మనసు దోచేలా 'పరిచయమే' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఆకట్టుకుంటున్న మెలోడీ! మోకిలా పిఎసిఎస్ చైర్మన్గా గౌండ్ర సత్యం ప్రమాణ స్వీకారం ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి ఏజెంట్ లేకుండానే హాలీవుడ్‌లో ఆఫర్.. విద్యుత్ జమ్వాల్ సంచలన విషయాలు! దారితప్పిన ఎస్ ఐ ఆర్.. రేవంత్ రెడ్డి ఫైర్ అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. కానిస్టేబుల్ రంగస్వామి

దంతాల పరిరక్షణకు శ్రద్ధ చూపాలి

Select Suryaa Now
దంతాల పరిరక్షణకు శ్రద్ధ చూపాలి

సూర్య రెంజల్  : గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు దంతాల యొక్క సంరక్షణ కొరకు శ్రద్ధ చూపాలని డాక్టర్ ఆదిత్య తేజ అన్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ధనురి నరసవ్వ అబ్బయ్య ఆధ్వర్యంలో దంత వైద్య పరీక్షలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మేఘన డెంటల్ ఆసుపత్రి మల్లారం వారి సౌజన్యంతో గ్రామంలోని ప్రజల దంతాల సంరక్షణ కొరకు వైద్య పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. దంతాలను సంరక్షణ పై శ్రద్ధ చూపితే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని కంటి చూపు కోల్పోకుండా శ్రద్ధ చూపాలన్నారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. మేఘన డెంటల్ కళాశాల డాక్టర్లు సాత్విక,రమ్య, అక్షిత,రోషిని,సుమ లు వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాణి, వార్డ్ సభ్యులు అజయ్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి సలాం, మాజీ సర్పంచ్ సాయరెడ్డి, వీడిసి అధ్యక్షులు బాబన్న, గ్రామస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.