రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పొదలను తొలగించండి.
కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ శివారు నుంచి జిల్లేడు- మండల పరిధిలోని లాల్ పాడు వరకు ఉన్న షాద్ నగర్ - పరిగి రోడ్డు పక్కన ఉన్న చెట్లను, పోదలను తొలగించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో టిఆర్పి మండల అధ్యక్షులు దర్గా వెంకటయ్య అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు పక్కన చెట్లు, పోదలు ఉండడం వల్ల వాహనదారులకు అవి కనిపించకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పక్కన ఉన్న చెట్లను పొదలను తొలగించాలని ఆయన కోరారు.
సత్యనారాయణ , మేజర్ న్యూస్ కొందుర్గు