పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పార్వతీపురం, సూర్య : పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులు వేధింపులు, భర్త అత్తారింటి వేధింపులు,భూ-ఆస్థి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం,ప్రేమ పేరుతో మోసం,ఇతర సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని,తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపవలెనని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 05 ఫిర్యాదులు అందాయి.సోమవారం ఉదయం 10.00 గం., నుండి మధ్యాహ్నం 01.00 గ., వరకు జరిగే "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు వారి సమస్యలు స్వేచ్ఛగా విన్నవించుకోవచ్చునని, వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణిత గడువులోపు పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటుగా డిసిఆర్బీ సిఐ జి.ఏ.వి.రమణ,ఎస్సై అశోక్ చక్రవర్తి సిబ్బంది పాల్గొన్నారు.
రిపోర్టర్ : ఎస్ఎస్ నాయుడు, పార్వతిపురం మన్యం.