BREAKING
కడియం మండలంలో ప్లాస్టిక్‌ నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం! చెత్త నిర్వహణ, వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలి బంట్వారం ఎస్సైగా పుండ్లిక్ బాధ్యతల స్వీకరణ దుల్లలో బాధిత కుటుంబాలకు చందన నాగేశ్వర్ పరామర్శ.. ఆర్థిక భరోసా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా సంకల్ప్ అభియాన్ వైద్య శిబిరం డ్రగ్స్ కు దూరం కావాలని అవగాహనా ర్యాలీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తున్న హర్ష చెముడు 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. వంద మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలు! ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి-- ఏవో శ్రీనివాస్ దేవీ నవరాత్రుల సందర్భంగా పలు చోట్ల అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులు బాక్సాఫీస్ వద్ద రూ. 480 కోట్లు దాటిన దృశ్యం 3.. అజయ్ దేవగన్ నటనపై మోహన్‌లాల్ ప్రశంసల జల్లు! అక్టోబర్ 30వ తేదీలోగా పెండింగ్‌ ఇళ్ల నిర్మాణాలను గ్రౌండింగ్ చేయాలి ఆక్వా కల్చర్ విదేశీ మారక ద్రవ్యార్జనకు మంచి మార్గం పిల్లలకు బయట ఆటలు ఎందుకు ముఖ్యం.. శారీరక, మానసిక వికాసానికి అవుట్‌డోర్ గేమ్స్ ఎంత అవసరం! సిఐఐ సదస్సులో పాల్గొన్న విప్ నాయకర్ ఆర్‌బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేట్ల పెంపు: ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులకే జెఫరీస్ ప్రాధాన్యం.. ఎందుకంటే? ప్రజల ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయొద్దు: అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

పత్రికా ప్రకటన అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌ అన్నమయ్య జిల్లా – మదనపల్లె: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త

Select Suryaa Now
పత్రికా ప్రకటన  అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి  జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌  అన్నమయ్య జిల్లా – మదనపల్లె:  అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త

 

అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌

అన్నమయ్య జిల్లా – మదనపల్లె:

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని యూఎస్‌ఎఫ్‌ఐ, ఏపీఎస్‌ జేఏసీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మదనపల్లెలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌)లో సబ్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి, ఏపీఎస్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 09-03-2026న విడుదల చేసిన జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ జీవో ప్రకారం కోచింగ్‌ సెంటర్ల నిర్వహణకు అవసరమైన అనుమతులు, నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, జిల్లాలో పలు కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.

సైనిక్‌, నవోదయ, ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, నీట్‌, జేఈఈ మెయిన్స్‌, బ్యాంకింగ్‌, యూపీఎస్సీ తదితర కోచింగ్‌ సెంటర్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దసరా సెలవుల్లోనూ విద్యార్థులను ఉదయం నుంచి సాయంత్రం వరకు కోచింగ్‌ పేరుతో తరగతులకు హాజరుకావాలని ఒత్తిడి చేయడం వల్ల వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కలికిరిలోని శాంతినికేతన్‌, రాయచోటిలోని నందిని, విజేత, మురళి విజ్ఞానం, మదనపల్లెలోని మల్లికార్జున, రిత్విక్‌, బాసర, వాణిశ్రీ, పీలేరులోని అక్షర తదితర కోచింగ్‌ సెంటర్లతో పాటు పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలోని కోచింగ్‌ సంస్థల నిర్వహణపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యాశాఖ అధికారులు, కోచింగ్‌ సెంటర్ల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి, విద్యార్థుల హక్కులు, సంక్షేమాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అనుమతులు లేని కోచింగ్‌ సెంటర్లను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీఎస్‌ జేఏసీ జిల్లా అధ్యక్షుడు గంగరాజు, యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు గణేష్‌ రాయల్‌ తదితరులు పాల్గొన్నారు.

సి శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి