గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు
పూసపాటి రేగ, సూర్య : దేవి నవరాత్రోత్సవాలు పూసపాటిరేగ మండలంలో వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి రెండో రోజైనా గాయత్రి దేవి అవతారంలో దర్శనము ఇవ్వడంతో పూసపాటి రేగ లో అమ్మవారికి పాయసంతో నైవేద్యాన్ని నివేదించారు కుంకుమ సహస్రనామాలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. కుమిలి లో పురాతన కాళికాదేవి అమ్మవారికి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి నూతన వస్త్రాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అమ్మవారికి దేవి ఖడ్గమాలతో పాటు శ్రీ లలిత సహస్రనామాలతో కుంకుమ పూజలను నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుండపరెడ్డి పేటలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వగా అధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొవ్వాడలో దుర్గాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం అమ్మవారికి గాయత్రీ దేవి అవతారంలో దర్శనమవ్వగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సహస్ర కుంకుమార్చన కార్యక్రమాలను నిర్వహించారు.
రిపోర్టర్ : రమేష్, పూసపాటిరేగ, విజయనగరం జిల్లా.