BREAKING
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

Select Suryaa Now
జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను  ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను  ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్

చుంచుపల్లి, సూర్య (మేజర్ న్యూస్)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. 
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, నేరాల గుర్తింపు, దర్యాప్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని  సూచించారు. ఇందులో భాగంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు, పోలీస్ స్టేషన్లలోని కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేశారు. ప్రస్తుతం మొత్తం 467 సీసీటీవీ కెమెరాలను ఈ కేంద్రానికి అనుసంధానం చేయడంతో జిల్లాలో నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది.
ఈ వ్యవస్థ ద్వారా ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించడం, నేరాల నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడం సులభతరం కానుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేరాల నియంత్రణలో సీసీటీవీ నిఘా వ్యవస్థ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

డి. జాన్సన్ డేవిడ్ (బాబు) 
సూర్య రిపోర్టర్ (చుంచుపల్లి మండలం) కొత్తగూడెం.