BREAKING
పత్రికా ప్రకటన అనుమతులు లేని సైనిక్‌, నవోదయ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి జీవో ఎంఎస్‌ నంబర్‌ 9ను అమలు చేయాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌ అన్నమయ్య జిల్లా – మదనపల్లె: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సైనిక్‌, నవోదయ తదితర కోచింగ్‌ సెంటర్లపై తక్షణమే చర్యలు త నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు

ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Select Suryaa Now
ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
 సూర్య నిర్మల్ ప్రతినిధి: ఆరుతడి పంటల సాగుతో ఎల్ నినో ప్రభావానికి ఉపశమనం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ఇతర ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులతో కలిసి అన్ని రైతు వేదికల ద్వారా కలెక్టర్లు, అధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉందని, రైతులంతా తక్కువ నీటితో, స్వల్ప కాలంలో పండే పంటలను మాత్రమే సాగు చేయాలని అన్నారు. వర్ష భావ పరిస్థితుల వల్ల రైతులు సాగు చేసిన పంటలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయని, దిగుబడులు పూర్తిగా తగ్గాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రైతులు నూనె గింజలు, పప్పు దినుసులు సాగు చేయాలని సూచించారు. నూనె గింజల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమలు, నువ్వుల పంటలతో పాటు, పప్పు దినుసుల్లో పెసర్లు, మినుములు, శనగలు, కందుల రకాలు సాగు చేయాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.సాంప్రదాయ పంటలకు భిన్నంగా ఇటువంటి పంటలను పండిస్తే భూసారం కూడా పెరుగుతుందని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు అందరూ కలిసికట్టుగా ఎల్ నినో ముప్పును ఎదుర్కోవాలని చెప్పారు. జాబ్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ విబిజి రామ్ జీ పథకం కింద పని పొందాలని పిలుపునిచ్చారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. విద్యుత్ వినియోగం కూడా గత ఏడాదితో పోలిస్తే పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తదనుగుణంగా రైతులు, అధికారుల సూచనల మేరకు తమ పంట సాగు ప్రణాళికలు చేసుకోవాలన్నారు.అధికారులంతా రైతులను కలుస్తూ వాతావరణ పరిస్థితులు, పంట సాగు వివరాలు వెల్లడించి, ఆరుతడి పంటల సాగువైపు వారిని ప్రోత్సహించాలన్నారు. వాస్తవ పరిస్థితులని వారికి వివరించాలని తెలిపారు.నిర్మల్ గ్రామీణ మండలం న్యూ పోచంపాడ్ రైతు వేదిక నుంచి ఈ రైతునేస్తం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వల్ప కాలంలో, తక్కువ తడులతో పండే పంటలు పండించేందుకు ముందుకు రావాలన్నారు. పప్పు దినుసులు, నూనె గింజల పంటలు పండించడం వల్ల రైతులు వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ విబిజి రామ్ జీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  రైతులు అధికారుల సేవలు వినియోగించుకోవాలని వివరించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు పండించాలని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులు అధికారుల సూచనలు పాటిస్తే మేలు కలుగుతుందని వివరించారు.ఈ రైతు నేస్తం కార్యక్రమంలో ఉద్యానవన పంటల అధికారి రమణ, డిఆర్డిఓ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేష్, తహసిల్దార్ ప్రభాకర్, ఎంపిడివో సుధాకర్,  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు భీమ్ రెడ్డి, షిండే ఆనంద్ రావు పటేల్, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.