BREAKING
అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి అద్దంకి మున్సిపల్ చైర్మన్ పీఠం 'జనరల్ కేటగిరీ'.

సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి?

Select Suryaa Now
సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి?

తెలంగాణ బ్యూరో ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు కూలీలకు డబ్బులు ఇవ్వడానికి కాంగ్రెస్‌కు మనసు లేదని మండిపడ్డారు. పంటలు వేయొద్దంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతు కూలీలు ఎలా బతకాలి.. వలసలు పోవాలా అని నిలదీశారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వలసలు వాపస్ వచ్చాయని.. ఇప్పుడు మళ్లీ వలసలు మొదలయ్యాయని విమర్శించారు. రైతులు డీజిల్ ఇంజిన్‌లు పెట్టుకుని పంటలను కాపాడుకుంటున్నారని.. ప్రతి దానికీ ఎల్‌నినోతో లింక్ పెడుతున్నారని మాజీ మంత్రి మండిపడ్డారు. బొగ్గు లేదంటే కూడా ఎల్‌నినో అంటున్నారన్నారు. సర్కార్ నిర్లక్ష్యం వల్లే రాష్టానికి ఈ పరిస్థితి వచ్చిందని విరుచుకుపడ్డారు. దేవాదులలో మోటార్లు ఎందుకు నడపడం లేదని ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్ట్‌లో వాడుకునేందుకు రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉందని తెలిపారు. ఆ నీళ్లను కూడా బీర్ల కంపెనీలకు ఇస్తున్నారని ఆరోపించారు. దసరా లిక్కర్‌కు షార్టేజ్ రావొద్దని వాళ్లకు నీళ్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యమని ప్రశ్నించారు. సింగూరుపై కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ ఏంటని ప్రశ్నించారు.
పంటల కోసం జూరాల గేట్లు తెరిస్తే రైతులను జైలుకు పంపారని.. తాగునీరు ఇవ్వకుండా బీర్ల కంపెనీలకు నీళ్లు ఇస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కూడా కేసులు పెట్టాలని హరీశ్ డిమాండ్ చేశారు. నీళ్లుండి కూడా ఎత్తని ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. రైతులతో గంట సేపు మాట్లాడే సమయం ముఖ్యమంత్రికి లేదా అంటూ ప్రశ్నించారు. బీర్ల కంపెనీలకు నీళ్లు, ఢిల్లీలో రాజకీయాలు తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకో పని లేదని హరీశ్ రావు విమర్శించారు