BREAKING
నెల్లిమర్ల నగర పంచాయతీలో మున్సిపల్ కార్మికుల నిరసన గళం..... రిటైర్మెంట్ బెనిఫిట్లు, న్యాయమైన డిమాండ్ల కోసం ధర్నా! అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ తిప్పలు జిల్లా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సీఎం సహాయ నిధితో పేదలకు ఆర్థిక భరోసా. ఐదేళ్లుగా కాలువ సమస్య..  * పరిష్కారం కోసం చీకటి సుహాసిని పోరాటం! లలితా దేవి ఆలయంలో దేవి నవరాత్రులు ప్రారంభం పోలీస్ ఉద్యోగార్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఎస్సై క్రాంతి పాటిల్ ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్లు జైలు శిక్ష -మూడు లక్షలు జరిమానా విధించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు వసంత్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో కేశవ్ పత్తి క్షేత్ర ప్రదర్శన సంగారెడ్డి నుంచి తుల్జాపూర్‌కు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న భవానీ మాత పాదయాత్ర రబీ సీజన్‌లో పంటల ప్రణాళికపై రైతులకు అవగాహన గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారిక ప్రత్యేక పూజలు సీతాగొర్లె వాణిపాలెంలో అంబరాన్నంటిన దుర్గమ్మ అంబలం పూజలు ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి

అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం

Select Suryaa Now
అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం

మదనపల్లె,మేజర్ న్యూస్ : తంబళ్లపల్లె నియోజకవర్గం,బి.కొత్తకోట పట్టణం,రాజా ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్,మాజీ శాసనసభ్యులు జి.శంకర్ యాదవ్ హాజరయ్యారు.ఇందులో భాగంగా తంబళ్లపల్లె నియోజకవర్గానికి సంబంధించి టిడిపి స్టిక్కర్లను ఆయన లాంఛనంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా జి.శంకర్ యాదవ్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేస్తున్నారన్నారు.ఇప్పటికే పార్టీ కార్యకర్తల కోసం రూ.5 లక్షల ప్రమాద బీమాను అమలు చేస్తున్నారని,ప్రస్తుతం టిడిపి కార్యకర్తల కొరకు స్టిక్కర్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు స్టిక్కర్లను అందజేస్తామన్నారు.పార్టీ కోసం శ్రమించిన ప్రతి ఒక్క కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.పార్టీకి కార్యకర్తలే బలమని,వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని,నియోజకవర్గంలోని అన్నిస్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించుకొని ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని ఆయన పిలుపునిచ్చారు.ప్రతి కార్యకర్త స్టిక్కర్లను తీసుకొని మొబైల్ ఫోన్లు,వాహనాలకు అతికించి పార్టీపై తమ అభిమానాన్ని చాటాలన్నారు.ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంఛార్జి కురవ ప్రకాష్,తెలుగు యువత రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు టి.సుదర్శన్ రెడ్డి,పెద్దఎత్తున తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి