ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధికి ఆదర్శంగా నిలిపి, అగ్రగామి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు, అవసరమైన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించనున్న ఈ-స్టేషన్‌కు సోమవారం తుంబూరు దయాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణ అభివృద్ధి అనేది కేవలం నిర్మాణాలకే పరిమితం కాకుండా, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన సేవలు అందించే దిశగా సాగాలని పేర్కొన్నారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలని దయాకర్‌రెడ్డి సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంబంధిత నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోపాటు పట్టణ ప్రగతికి మరింత దోహదపడుతుందని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా మున్సిపాలిటీకి మరింత గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఈ-స్టేషన్ నిర్వాహకులు కనకమేడల గోపాలకృష్ణ, జక్కంపూడి రాము, కౌన్సిలర్లు వెంపటి ఉమా వెంకన్న, బానోత్ దివ్య, కాంగ్రెస్ నాయకులు గణపారపు వీరన్న, వెంపటి సురేష్, రామిశెట్టి రమేష్, వెంపటి రవి, మోహన్‌రెడ్డి, చీకటి శ్రీను, తరుణ్, భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.