BREAKING
ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ లేదు.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్! ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డర్బన్ టెస్టు: నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ 221/5, ఆధిక్యం 327 రెన్‌షా మరో అర్ధసెంచరీ.. నోర్కియా బౌలింగ్‌లో క్యారీ బౌల్డ్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్ రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్‌, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు. వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స నాణ్యతకు నామాలు..! పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం! సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? దసరా కానుకగా రాబోతున్న రామాయణ సెకండ్ ట్రైలర్.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!

త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా

Select Suryaa Now
త్వరగా ప్రజావాణి దరఖాస్తులను  పరిష్కరించాలి - కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ప్రజావాణి ద్వారా అందే ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యాన్ని సహించబోమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ఉపాధి హామీ పథకం, భూభారతి తదితర అంశాలపై కలెక్టరేట్ స్థాయిలో 42, మండల స్థాయిలో 47 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను నిర్ణీత గడువులోగా ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు.ఒకే సమస్యపై ప్రజలు పదేపదే ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా రెవెన్యూ అధికారి స్రవంతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.