BREAKING
ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ లేదు.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్! ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డర్బన్ టెస్టు: నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ 221/5, ఆధిక్యం 327 రెన్‌షా మరో అర్ధసెంచరీ.. నోర్కియా బౌలింగ్‌లో క్యారీ బౌల్డ్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్ రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్‌, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు. వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స నాణ్యతకు నామాలు..! పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం! సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? దసరా కానుకగా రాబోతున్న రామాయణ సెకండ్ ట్రైలర్.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!

ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Select Suryaa Now
ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం -వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా భూమిపూజ -ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.3.40 కోట్లు మంజూరు -పాల్గొన్నత్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో శ్రీవారి దివ్యాలయ నిర్మాణానికి టీటీడీ సోమవారం శ్రీకారం చుట్టింది. వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

వేదమంత్రాల సాక్షిగా ఆధ్యాత్మిక శుభారంభం

ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ముందుగా హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భూమిపూజ ప్రదేశాన్ని సంప్రోక్షణ చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణల మధ్య భూమిపూజ నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టం అనంతరం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారితో కలిసి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి ఆలయ నిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దివ్యదర్శన భాగ్యాన్ని చేరువ చేయడంతో పాటు, సనాతన ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు.

20.04 సెంట్ల భూమి కేటాయింపు–ప్రహరీకి రూ.3.40 కోట్లు

ఖమ్మం అర్బన్ మండలం, దరుసులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబరు 408/2లో తెలంగాణ ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం 20.04 సెంట్ల భూమిని కేటాయించింది. ఈ భూమికి రక్షణగా ప్రహరీ గోడ నిర్మాణం కోసం టీటీడీ రూ.3.40 కోట్లు మంజూరు చేసింది. అవసరమైన నిధులతో ప్రధాన ఆలయ నిర్మాణ పనులను టిటిడి చేపట్టనుంది.

ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం నిర్మాణం

ఖమ్మంలో నిర్మించనున్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, రాజగోపురం, పోటు (వంటశాల), ప్రాకారం తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం ప్రాంత భక్తులకు శ్రీవారి దర్శనం మరింత చేరువ కావడంతో పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ధార్మిక ప్రచారానికి ఈ క్షేత్రం ప్రధాన కేంద్రంగా నిలవనుంది.

రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే ఆధ్యాత్మిక కేంద్రం: శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి

ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారు ఖమ్మం ప్రజలకు మంగళాశాసనాలు అందిస్తూ, ఖమ్మం నగరం రెండు తెలుగు రాష్ట్రాలను ఆధ్యాత్మికంగా అనుసంధానించే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. శ్రీనివాసుడి కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరూ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అరిష్టాలు తొలగి, పాడిపంటలతో పల్లెలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆశీర్వదించారు. భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం పూర్తయి, ఖమ్మం ఆధ్యాత్మిక వైభవానికి చిరునామాగా నిలవాలని ఆకాంక్షించారు.

దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ కృషి: చైర్మన్ బీఆర్ నాయుడు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను నిర్మించాలనే సంకల్పంతో టీటీడీ ముందుకు సాగుతోందని తెలిపారు. హిందూ ధర్మం, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు ఆలయాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణంలో స్థానిక భక్తుల భాగస్వామ్యం, విరాళాల ప్రాధాన్యాన్ని వివరించారు.

సనాతన ధర్మ పరిరక్షణకు ఆలయాలు కీలకం: మంత్రి తుమ్మల

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన చిన్నజీయర్ స్వామివారికి, సహకరించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి ధన్యవాదాలు తెలియజేశారు. దేవదేవుడి ఆశీస్సులతో నిర్మితమయ్యే ఈ ఆలయం ఖమ్మం నగరానికి ఆధ్యాత్మిక శోభను తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డా.ఎ.శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఎస్‌ఈ ఇన్‌ఛార్జి ఎస్. ప్రసాద్, డీఈ సురేంద్ర నాథ్ రెడ్డి, సూపరింటెండెంట్ మల్లికార్జున, అర్చకులు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్