BREAKING
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు! కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్ర భుజంగ్ రావ్ కు సన్మానం ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' నటి సామ్.. క్యూట్ ఫోటోలు వైరల్! ఇర్విన్ రిజర్వాయర్ రద్దుకై ప్రజావాణిలో భూనిర్వాసిత రైతుల వినతి పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకం పెంచేలా సమస్యల పరిష్కారం ఉండాలి; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొనసాగుతున్న చేరికలు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం తమిళ దర్శకుడితో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్! చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి నిహారిక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి ప్రజావాణికి 12 దరఖాస్తులు శ్రీరాముడి వేషధారణలో అనుపమ ఫేమ్ గౌరవ్ ఖన్నా.. రణ్‌బీర్ కపూర్‌కంటే అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు!

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. కానిస్టేబుల్ రంగస్వామి

Select Suryaa Now
మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. కానిస్టేబుల్ రంగస్వామి

మంత్రాలయం, మేజర్ న్యూస్':విధి అంటే కేవలం బాధ్యతలు నిర్వర్తించడం మాత్రమే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, చివరి ప్రయాణంలోనూ మానవత్వాన్ని చాటడం! ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు కానిస్టేబుల్ రంగస్వామి. తుంగభద్ర నదిలో మృతిచెందిన ఓ మహిళ మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆయనే స్వయంగా భుజాన మోసి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం నడిచారు. ఆయన చూపిన ఈ సేవాభావం పలువురి ప్రశంసలు అందుకుంది.
కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా మాలవల్లి గ్రామానికి చెందిన జయశీల (41) తన భర్త మహేశప్ప, కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం మంత్రాలయానికి వచ్చారు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తిరిగి వెళ్లగా, తాను మరో రెండు రోజుల పాటు అక్కడే ఉండి సేవ చేసుకుని వస్తానని ఆమె చెప్పినట్లు సమాచారం.
ఆదివారం మధ్యాహ్నం తుంగభద్ర నదిలోకి దూకే ముందు జయశీల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఆమె నదిలో దూకిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ఆమె మృతిచెందినట్లు సమాచారం.
చివరి ప్రయాణంలోనూ మానవత్వమే ముఖ్యం!
నదిలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకురావడానికి స్థానికులు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రంగస్వామి వెనుకడుగు వేయలేదు. తన బాధ్యతను మానవీయ కోణంలో చూసి, మృతదేహాన్ని స్వయంగా భుజాన ఎత్తుకున్నారు. సుమారు 1.5 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి ఒడ్డుకు చేర్చారు.
ఒకవైపు విధి నిర్వహణ.. మరోవైపు మరణించిన వ్యక్తికి గౌరవప్రదమైన అంతిమ సహాయం అందించాలనే మానవీయ స్పందన.. ఈ రెండింటినీ తన చేతల్లో చూపించారు రంగస్వామి. కష్ట సమయంలో బాధ్యత నుంచి తప్పుకోకుండా ముందడుగు వేసిన ఆయన తీరు పోలీసు సేవల్లోని మానవత్వాన్ని చాటిచెప్పింది.యూనిఫాం వెనుక ఉన్నది కేవలం అధికారం కాదు.. ఆపదలో అండగా నిలిచే హృదయం కూడా! మృతదేహాన్ని భుజాన మోసిన కానిస్టేబుల్ రంగస్వామి సేవాభావం అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది. విధి నిర్వహణలో ఆయన చూపిన మానవత్వానికి పలువురు ప్రశంసలు కురిపించారు.