శంకర్పల్లి పిఎసిఎస్ చైర్మన్ గా బొల్లారం వెంకటరెడ్డి ప్రమాణస్వీకారం
శంకర్పల్లి పిఎసిఎస్ చైర్మన్గా బొల్లారం వెంకటరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం రోజున వెంకట్ రెడ్డి తో పాటు 12 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన చైర్మన్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనకు పిఎసిఎస్ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే కాలే యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన మండలంలోని కాంగ్రెస్ నాయకులకు, రైతులకు ధన్యవాదాలు తెలిపారు. తమ పాలకవర్గం రైతుల కోసం ఎల్లప్పుడు కృషి చేస్తుందని తెలిపారు.
(మాడిశెట్టి రాజశేఖర్, మేజర్ న్యూస్)