BREAKING
ఉద్యాన పరిశోధనా స్థానంలో ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో సాగులో ఆధునిక పద్ధతుల పై సదస్సు -- ముఖ్య అతిధులుగా ఎంపీ పుట్టా మహేష్ , ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విగ్రహాలను కూల్చగలరేమో.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చెరిపేయలేరు గీతంలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు రోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాలా? పేదవాడు వైద్యం కోసం అప్పులపాలవ్వాలా? ఇంకెన్నాళ్లు నేరేడుచర్ల ప్రజలకు ఈ వైద్య కష్టాలు? నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి బి ఆర్ ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్ ధనలక్ష్మి దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు ​కొత్తపేటలో భక్తి, సేవల సమ్మేళనం.. ఉచిత వైద్యశిబిరం, అన్నదాన కార్యక్రమం విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు. 'గరివిడి లక్ష్మి' ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! గాయత్రి దేవి అలంకారంలో తాళమ్మ మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక ఈ-ఆటోల ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా

కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్

Select Suryaa Now
కామారెడ్డిలో  సంచలనం సృష్టించిన  వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్

సూర్య కామారెడ్డిజిల్లా ప్రతినిధి :కామారెడ్డి పట్టణంలోని  ముష్రీఫ్ బాగ్‌కు చెందిన  చిట్మల్ అనసూయ (66) ను  గత నెల  29న  సాయంత్రం  6 గంటల నుంచి 7.30 గంటల మధ్య హత్య చేసి,  ఆమె ధరించిన బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.  ఇంటి నుంచి బయటకు  వెళ్లిన భర్త తిరిగి వచ్చేసరికి  అనసూయ మంచంపై అపస్మారక  స్థితిలో పడి  ఉండటాన్ని గమనించారు.   ఆమె మెడపై గాయాల  గుర్తులు  ఉండటంతో పాటు,  బంగారు పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలు  కనిపించకపోవడంతో  కుటుంబ సభ్యులు పోలీసులకు  ఫిర్యాదు చేయగా  కామారెడ్డి పట్టణ  పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు హత్య,  దోపిడి  కేసు నమోదు  చేసి దర్యాప్తు  ప్రారంభించారు.జిల్లా ఎస్పీ  యం. రాజేష్ చంద్ర,  ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్  పర్యవేక్షణలో పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి తో ప్రత్యేక బృందం ఏర్పాటుచేసి దర్యాప్తు ప్రారంభించారు .  సంఘటనా  స్థలంలో లభించిన  ఆధారాలు, సాంకేతిక సమాచారం,  ఇతర దర్యాప్తు వివరా లను  విశ్లేషిస్తూ  నిందితుల గుర్తింపుపై  ప్రత్యేక  దృష్టి సారించారు.దర్యాప్తులో  భాగంగా మృతురాలి ఇంట్లో  గత కొంతకాలంగా పని మనిషిగా  పనిచేస్తున్న  రజితపై అనుమానం రావడంతో పోలీసులు ఆమె ప్రతీ  కదలికలపై  దృష్టి సారించారు. ఈ క్రమంలో రజిత,ఆమె భర్త నర్సింగ్‌ లను  గంజ్ పాఠశాల సమీపంలో  అదుపులోకి తీసుకొని విచారించగా, నేరానికి  సంబంధించిన  వివరాలు  వెల్లడైనట్లు  పోలీసులు తెలిపారు. పక్కా పథకంతో హత్య చేసి ఆభరణాలు  దోపిడీ పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. పెద్ద మొత్తంలో డబ్బు  సంపాదించాలనే దురాలోచనతో రజిత, నర్సింగ్‌లు మృతు రాలి అనసూయ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించాలని పథకం వేసుకున్నారు. అయితే, తమను అనసూయ గుర్తుపట్టే అవకాశం ఉండటంతో ఆమెను హత్య చేసి ఆభరణాలను దోచుకోవాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
పథకం ప్రకారం, 29న అనసూయ భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో అనసూయ ఒక్కతే ఇంట్లో ఉంది అని రజిత తన భర్త నర్సింగ్‌తో కలిసి అనసూయ ఇంట్లోకి ప్రవేశించారు.  అనసూయ పూజ చేస్తుండగా విద్యుత్ సరఫరాను నిలిపివేసి, ఆమెను కింద  పడేసి  మరో గదిలోనికి  ఈడ్చుకెళ్లారు.  అనంతరం  ఒక తువ్వాలుతో గొంతుపై గట్టిగా బిగించి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం, ఆమె ధరించిన బంగారు  పుస్తెల తాడు, రెండు ఉంగరాలు, చెవి ఆభరణాలను తీసుకొని  అక్కడి నుంచి వెళ్లిపో యినట్లు  పోలీసులు తెలిపారు.  నేరంపై అనుమానం రాకుండా రజిత యథావిధిగా అనసూయ  ఇంట్లో పనులకు వెళ్ళి  వచ్చినట్లుగా నటించా రని  విచారణలో  వెల్లడైంది. గతంలోనూ మరో ఇంట్లో చోరీ  విచారణలో రజిత గతంలో కామారెడ్డిలోని  భూమయ్య ఇంట్లో  పనిమనిషిగా పని చేసిన సమయంలోనూ  బంగారు ఆభరణాలను  దొంగిలించినట్లు తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో ఇంటి యజమాని బయటకు వెళ్లగా, ఆయన భార్య తమ కుమార్తెను రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించేందుకు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరులేరని సుమారు 4 తులాల బంగారు పుస్తెల తాడు, 5 గ్రాముల బంగారు చెవి కమ్మలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. నిందితుల వివరాలు: 1 బోసు రజిత, భర్త: నర్సింగ్, వయస్సు 40 సంవత్సరాలు, నివాసం: బతుకమ్మ కుంట, కామారెడ్డి. 2 బోసు నర్సింగ్, తండ్రి: యాదయ్య, వయస్సు 48 సంవత్సరా లు, నివాసం: బతుకమ్మ కుంట, కామారెడ్డి. స్వాధీనం చేసుకున్న సొత్తు
1.    బంగారు పుస్తెల తాడు (మంగళసూత్రం).  2.    రెండు బంగారు ఉంగరా లు.  3.    చెవి ఆభరణాలు.  (మొత్తం సుమారు 8 తులాల బంగారు ఆభరణాలు.) 4.నిందితురాలి సెల్‌ఫోన్. ఈ కేసులో  నిందితులైన భార్యాభర్తలు  ఇద్దరిని  రిమాండ్ నిమిత్తం  న్యాయస్థానంలో హాజరు పరచనున్నట్లు  తెలిపారు.ఈ కేసును ఛేదించడంలో సమర్థవంతంగా పనిచేసి, నిందితులను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన కామారెడ్డి పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి. నరహరి, ఏఎస్ఐ రంగారావు, పోలీస్ కానిస్టేబుళ్లు రామస్వామి, రాజు నాయక్, సంపత్‌లను జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర, అభినందించారు. వారి విధి నిర్వహణ, అంకితభావం, ప్రతిభను ప్రశంసించారు.