BREAKING
*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు ప్రతి వార్డులో వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి

ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త!

Select Suryaa Now
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త!
సూర్య-గోదావరిఖని:ఒక్క చిన్న నిర్లక్ష్యం.. ఒక్క అనుమానాస్పద లింక్‌ క్లిక్‌.. బ్యాంకు ఖాతాలోని సొమ్మంతా మాయమయ్యే ప్రమాదం ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశ, భయం, బలహీనతలను ఆసరాగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల నివారణ, ఆన్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో మంగళవారం రామగుండం పోలీసుల ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, అధికారులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ‘ఆగండి.. ఆలోచించండి.. నిర్ధారించుకోండి’ అనే సూత్రాన్ని పాటించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. సందేహాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులు లేదా డబ్బు బదిలీకి సంబంధించిన అభ్యర్థనలు వచ్చినప్పుడు తొందరపడి స్పందించవద్దని స్పష్టం చేశారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీ వంటి సున్నితమైన వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ సైబర్ నేరగాళ్లు ప్రత్యేక కేంద్రాల ద్వారా వ్యవస్థీకృతంగా మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఆకర్షణీయమైన ఉద్యోగాలు, అధిక వేతనాల పేరుతో యువతను ప్రలోభపెట్టి సైబర్ నేరాలకు ఉపయోగించుకుంటున్నారని హెచ్చరించారు. ఇతరులు ఎదుర్కొన్న సైబర్ మోసాల నుంచి పాఠాలు నేర్చుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
---------
అత్యాశే నేరగాళ్ల అస్త్రం!
 
ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన కల్పించడం పోలీసుల బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేస్తున్న యువ ఇంజనీర్లు తమ సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను సైబర్ నేరాల నివారణకు, సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని కోరారు. ఎన్టీపీసీ సంస్థకు, స్థానిక పోలీసులకు మధ్య గత 40-50 సంవత్సరాలుగా కొనసాగుతున్న సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని, ప్రతిష్టాత్మక సంస్థల్లో కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక, సమన్వయం ఎంతో అవసరమని వివరించారు.
-----------
వీడియోల ప్రదర్శనతో అవగాహన
 
కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరగాళ్లు ప్రజలను వివిధ పద్ధతుల్లో ఎలా మోసం చేస్తున్నారో వివరించే వీడియోలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల పద్ధతులు, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులు, అధికారులకు అవగాహన కల్పించారు. పెద్దపల్లి జోన్, రామగుండం సర్కిల్, ఎన్టీపీసీ పోలీసులు, రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రామగుండం-తెలంగాణ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెడ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఫైజ్ తైయాబ్, పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, సీసీపీఎస్ ఏసీపీ రంగారెడ్డి, రామగుండం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వై.కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్‌ఐ వెంకట్ తదితరులతోపాటు ఎన్టీపీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
--------