BREAKING
జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల

Select Suryaa Now
ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం.  వైద్యానికి  ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల

పాలకొల్లు, మేజర్ న్యూస్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. అనారోగ్యంతో ఆర్థికంగా కుంగిపోతున్న  కుటుంబాలకు భరోసా కల్పించడం.. ప్రజాప్రతినిధిగా తన బాధ్యతను సేవగా భావించడం.. ఈ లక్ష్యాలతో రాష్ట్ర  జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు  అండగా నిలుస్తున్నారు. వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయం అందేలా ఆయన చేస్తున్న ప్రయత్నాలు పలువురి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. అందులో  భాగంగా మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం పాలకొల్లు నియోజకవర్గ చరిత్రలో ఒకే రోజు 355 మంది లబ్ధిదారులకు రూ.1.55 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించడం విశేషంగా నిలిచింది..

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చెక్కులను అందజేశారు. ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకోలేక అప్పులపాలవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం కొండంత అండగా నిలుస్తుంది. ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ప్రభుత్వ సాయం అందించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది.అనారోగ్యం ఒకవైపు.. వైద్యానికి అయ్యే ఖర్చులు మరోవైపు.. సామాన్య కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సాయం అందితే బాధిత కుటుంబాలకు ధైర్యం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన మంత్రి నిమ్మల రామానాయుడు, అర్హులైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అందేలా చొరవ తీసుకుంటున్నారు. వైద్య సాయం కోసం వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి, అర్హత మేరకు నిధులు మంజూరయ్యేలా కృషి చేయడం ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నారు.ఒక్కొక్క కుటుంబానికి అందే సాయం వెనుక ఒక బాధితుడి ప్రాణం నిలబెట్టుకోవాలనే ఆశ, ఒక కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆకాంక్ష ఉన్నాయి. అందుకే ఈ కార్యక్రమాన్ని కేవలం ఆర్థిక సాయం పంపిణీగా కాకుండా.. కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న భరోసాగా చూడాల్సి ఉంటుంది.ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులకు చేరవేయడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఆ దిశగా మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న ప్రయత్నాలు పాలకొల్లు నియోజకవర్గంలో వైద్య సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఊరటనిస్తున్నాయి.ఆపదలో ఉన్నప్పుడు అందే సాయం విలువ వెలకట్టలేనిది. బాధితుల కష్టాన్ని గుర్తించి, వారికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందేలా కృషి చేయడమే ప్రజాసేవకు అసలైన అర్థం.

 రిపోర్టర్ నరసింహారావు పాలకొల్లు పశ్చిమగోదావరి జిల్లా