BREAKING
దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం బోయింగ్‌కు ఊరట...సెప్టెంబర్‌లో అత్యధికంగా 57 విమానాల డెలివరీ!

పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా

Select Suryaa Now
పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా

వరికుంటపాడు మేజర్ న్యూస్ :   పోలీస్‌స్టేషన్‌ ఎదుట మహిళ సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై ఐసీడీఎస్‌ అధికారులుమంగళవారం స్పందించి జిల్లా మహిళా, శిశు సంక్షేమం, సాధికారత శాఖ పీడీ నాగ శైలజ ఆదేశాల మేరకు సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్‌లైన్‌ సిబ్బంది పామూరులోని ప్రజా వైద్యశాలకు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు.  భర్త రవి ని ఆదివారం అరెస్టు కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడం జరిగినది రవిని ఆత్మకూరు సబ్ జైలు తరలించారు. తన భర్త  ఎక్కడ ఉన్నాడో తెలియక పోవడం తొ మనస్తాపానికి గురై వస్మోయిల్ ని పోలీస్‌స్టేషన్‌ ఎదుట తాగినది. గమనించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం పామూరుకు పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన పీడీ నాగ శైలజ ఆదేశాలతో సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ అడ్మిన్‌ ఎస్‌.కె. షహనాజ్‌, కేస్‌ వర్కర్‌ శారద, డీసీపీయూ సిబ్బంది సమత, పావని, చైల్డ్‌లైన్‌ సిబ్బంది హర్షిత బాధితురాలిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. 
అనంతరం బాధితురాలికి కౌన్సెలింగ్‌ నిర్వహించి, కుటుంబ సమస్యలను ఆవేశంతో కాకుండా చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ముగ్గురు చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. అవసరమైనప్పుడు సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపారు. కౌన్సెలింగ్‌ అనంతరం బాధితురాలు తన పిల్లలను చూసుకుంటానని, ఇంటికి వెళ్లాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల సహకారంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు సఖి బృందం చర్యలు చేపట్టింది.