విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు.
సూర్య న్యూస్ ముండ్లమూరు.
విద్యుత్ చౌర్యానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దర్శి విద్యుత్ శాఖ ఈ ఈ రామయ్య హెచ్చరించారు. మండలంలో మంగళవారం విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు29 బృందాలుగా ఏర్పడి గ్రామాలలో తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో భాగంగా 13 విద్యుత్ మీటర్లు లేకుండా విద్యుత్ వాడుతున్న వారిపై 13 వేల రూపాయల జరిమానా విధించారు. విద్యుత్ చోర్యానికి పాల్పడిన 16 మందిని గుర్తించి 1,96 వేల రూపాయలు జరిమానా విధించారు. అనుమతి లేకుండా అధికలోడు వాడుతున్న104 మందిని గుర్తించి2.67 లక్షలు జరిమానా విధించారు. ముగ్గురికి అపరాధ రుసుము కింద9,000 జరిమానాలను విధించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఈ ఈ హైమావతి డి ఈ ఈ వెంకటేశ్వర్లు, దరిశి ముండ్లమూరు కురిచేడు తాళ్లూరు దొనకొండ మర్రిపూడి మండలాల ఎ. ఈ లు సిబ్బంది పాల్గొన్నారు.