BREAKING
సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం బోయింగ్‌కు ఊరట...సెప్టెంబర్‌లో అత్యధికంగా 57 విమానాల డెలివరీ! వాల్‌మార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ మొగిలిచర్లలో టీడీపీలోకి చేరిన 6 కుటుంబాలు లింగసముద్రం (

గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన

Select Suryaa Now
గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం 

గోదావరి ఘాట్‌లో రూపుదిద్దుకుంటున్న రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రివర్ ఫ్రంట్ ఆధునీకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే వాసు సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. గోదావరి ఘాట్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా రాజమహేంద్రవరం నగరానికి కొత్త శోభ తీసుకురావడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పూర్తయితే గోదావరి అందాలను ఆస్వాదించేందుకు నగరవాసులకు మెరుగైన అవకాశం లభించడంతో పాటు, పర్యాటకులను ఆకర్షించేందుకు దోహదపడుతుందని తెలిపారు. నగర సుందరీకరణకు, పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న ఈ పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్  సూచించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు.