కొనకనమిట్ల మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతా -
మార్కాపురం ఎమ్మెల్యే కందుల
పొదిలి, మేజర్ న్యూస్;
కొనకనమిట్ల మండలాన్ని అభివృద్ధి ముందుంచుతానని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం వెలిగండ్ల లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రు.22 లక్షల సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల మాట్లాడుతూ గతంలో గొడ్డలి పార్టీ నాయకులు ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా బ్రష్టు పట్టించారని ఇప్పుడు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు అభివృద్ధిని పక్కన పెట్టి అరాచకాలు వేధింపులు భూకబ్జాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మార్చి ప్రజా విశ్వాసం కోల్పోయారని విమర్శించారు.ఈ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమం తో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నామని త్వరలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.కార్యక్రమంలో కొనకనమిట్ల మండల టిడిపి నాయకులు , వెలిగండ్ల గ్రామ తెలుగుదేశం నాయకులు ప్రజలు పాల్గొన్నారు.