ఉద్యాన పరిశోధనా స్థానంలో ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో సాగులో ఆధునిక పద్ధతుల పై సదస్సు -- ముఖ్య అతిధులుగా ఎంపీ పుట్టా మహేష్ , ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పెదవేగి, సూర్య న్యూస్:ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో పంటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించి రైతులకు మేలైన దిగుబడులు అందించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఉద్యాన శాఖ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో పెదవేగి మండలం విజయరాయి ఉద్యాన పరిశోధనా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ , దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునిక యంత్రాలు, సోలార్ డ్రైయర్లు, తోటల సాగు నమూనాలను పరిశీలించి, బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ.. కేరళ, తమిళనాడు తరహాలో అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తనాలు, హైబ్రిడ్ మొక్కలను పరిశోధనా కేంద్రం ద్వారా రైతులకు సబ్సిడీపై అందించాలని, క్షేత్రస్థాయి పరిశోధనల ఫలితాలు నేరుగా అన్నదాతలకు చేరాలని కోరారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. నాణ్యమైన మొక్కలనే రైతులకు విక్రయిస్తామని, శాస్త్రవేత్తలు రైతులతో నిరంతరం టచ్‌లో ఉండేలా ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ ఉద్యానవన పంటల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులను రైతులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్సలర్, శాస్త్రవేత్తలు, అధికారులు, కూటమి నాయకులు, రైతులు పాల్గొన్నారు.
పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు