BREAKING
సంవత్ 2083 ముహూర్త్ ట్రేడింగ్ 'చీట్ షీట్' మెగా రైతు మేళాకు 11 బస్సులు .. ఏవో నిశాంత్ కుమార్ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా శ్రీ మహాలక్ష్మి మాత పూజలు - హోమం & దీపావళి వేడుకలు 20 మంది ఉద్యోగులకు రూ. 20 లక్షల దీపావళి బోనస్ ఇచ్చిన సూరత్ వ్యాపారి దీపావళి వేడుకల విచ్ఛిన్నంపై అమెరికా ఎంపీ ఆగ్రహం కేంబ్రిడ్జ్ కమ్యూనిటీ క్రీడా పోటీలు – 2026లో అద్విత విద్యార్థుల అద్భుత ప్రతిభ! 11 పతకాలతో క్రీడా విజయకేతనం! బస్తర్ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి: నక్సలిజం రహిత తొలి పండుగ ఎల్ఏ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత: ఇద్దరి నిర్బంధం, నిత్య రామన్ ఖండన దీపావళి వేళ ఢిల్లీలో విష పొగమంచు.. 383కి పడిపోయిన ఏక్యూఐ పండుగల రద్దీకి పకడ్బందీ ఏర్పాట్లు: రైల్వే మంత్రి న్యూజెర్సీ ఇంట్లో ముగ్గురు విగతజీవులుగా లభ్యం ప్రపంచ నేతల దీపావళి శుభాకాంక్షలు: శాంతి, సామరస్యానికి పిలుపు రోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్: పికప్ ట్రక్కును ఢీకొన్న దృశ్యాలు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ను కలిసిన రామగిరి నూతన జడ్పీటీసీ బైనేని శిరీష .. 17 ఎంపీటీసీ స్థానాల్లో ప్రశాంత ఎన్నికలు.. ఫలితాల రోజు వరకు పటిష్ట బందోబస్తు.. ఎస్‌ఐ రవికుమార్‌కు ఎంపీటీసీల అభినందనలు!...ఎన్నికల కోడ్ నుంచి ఫలితాల ప్రకటన వరకు అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసుల నిఘా.....

హక్కుల కోసం ఉద్యమించాలి-తుడుం దెబ్బ మండల కమిటీ ఏకగ్రీవం-తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబు

Select Suryaa Now
హక్కుల కోసం ఉద్యమించాలి-తుడుం దెబ్బ మండల కమిటీ ఏకగ్రీవం-తుడుందెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పోడెం బాబు

వెంకటాపురం నూగూరు, మేజర్ న్యూస్,
ఆదివాసి హక్కుల కోసం ప్రతి ఆదివాసి గూడెం లోనే యువకులంతా ఉద్యమించాలని జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు అన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలోని రహదారులు భవనాలు అతిథి గృహ ఆవరణలో మంగళవారం ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ  నూతన మండల కమిటీనీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిసే బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా తుడుం దెబ్బ జాతీయ ఉపాధ్యక్షులు పొడెం బాబు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వం కోసం యువతీ, యువకులు ప్రతి ఆదివాసి గూడెం నుండి ముందు వరసలో ఉండాలన్నారు. డిసెంబర్ 9 చలో హైదరాబాద్ భారీ బహిరంగ సభకు వెంకటాపురం మండలం నుంచి పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో దోపిడీకి గురి అవుతున్న నీరు, అడవి,భూమి,విద్య, వైద్యం,ఉద్యోగాల విషయంలో ఉద్యమించాలని కోరారు. 
అనంతరం తుడుం దెబ్బ మండల కమిటీ,ఆదివాసి విద్యార్థి, రైతు,మహిళ సంఘాల మండల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.తుడుం దెబ్బ మండల కమిటీ.. మండల అధ్యక్షుడిగా పూనెం శ్రీకాంత్, గౌరవ అధ్యక్షులుగా పూనెం గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా ఎలకం సాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మిచ్చ సురేష్, ఉపాధ్యక్షులుగా రేగ నరేష్,సున్నం నాగేంద్ర,  కోరం  ధని కుమార్, కోశాధికారిగా కొంచెం నరేందర్, సహాయ కార్యదర్శులుగా కారం సాయి తేజ,మడకం రమేష్,కార్యవర్గ సభ్యులుగా సోడే శ్రీను, కాపుల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఆదివాసి విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడిగా గట్టుపల్లి అశోక్, ప్రధాన కార్యదర్శిగా పాయం శశికుమార్,వర్కింగ్ ప్రెసిడెంట్ గా పర్షిక అనిల్,ఉపాధ్యక్షులుగా కెక్కెం తేజ,సహాయక కార్యదర్శులుగా పంది మనోజ్,తాటి వెంకటేశ్వర్లు,కార్యవర్గ సభ్యులుగా మేకల మహేష్,సురటి శివశంకర్, కోర్స రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు.ఆదివాసి రైతు సంఘం
గౌరవ అధ్యక్షులుగా పూనెం మునేశ్వరరావు, మండల అధ్యక్షుడిగా సొర్లం ఆదినారాయణ, ఉపాధ్యక్షులుగా పూజారి నరసింహారావు, కంటి వెంకయ్య ఎన్నికయ్యారు.ఆదివాసి మహిళా సంఘం
గౌరవ అధ్యక్షులుగా తాటి బుచ్చమ్మ, మండల అధ్యక్షులుగా పర్సిక సమ్మక్క,ప్రధాన కార్యదర్శిగా మడి రమాదేవి,ఉపాధ్యక్షులుగా పర్షిక దీపిక,ఆలం సమ్మక్క,సహాయ కార్యదర్శిగా మిచ్చ అనిత, పూనమ్ ఝాన్సీ,ఎర్రం స్వప్న,తాటి సుభద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఎన్నికైన మండల నాయకత్వానికి పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో నుండి గ్రామ కమిటీలను ఎన్నుకోవాలని సూచించారు.కింది స్థాయి నుండి సంఘాన్ని బలోపితం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి,ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అట్టం సుభద్ర,తుడుం దెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రేగ గణేష్,తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు నల్ల బోయిన లక్ష్మణరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం చంటి,ఉపాధ్యక్షులు పద్దం సుధాకర్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బకట్ల శ్రీకాంత్,తుడుం దెబ్బ డివిజన్ అధ్యక్షులు పోడెం శోభన్, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా నాయకులు పాయం పూర్ణచందర్,తుడుం దెబ్బ సీనియర్ నాయకులు యాలం సాయి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పూనం వరప్రసాద్,ఆదివాసి యువత,యువకులు, ప్రజలు వందల సంఖ్యలో పాల్గొన్నారు.

రిపోర్టర్ : చక్రధర్, వెంకటాపూర్ ,ములుగు జిల్లా