BREAKING
స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం... టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు విద్యార్థులకు విపత్తు నివారణ అవగాహన సదస్సు గృహనిర్బంధానికి ప్రో-రష్యన్ మాజీ అధ్యక్ష అభ్యర్థి! శ్రీ అన్నపూర్ణదేవి అలంకారంలో అమ్మవారు ఉనుదుర్రులో రూ.16.50 లక్షలతో రహదారి పనులకు శంకుస్థాపన శాకాంబరీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు జి ఆర్ సి ద్వారా మహిళల సమస్యల పరిష్కారం... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమెరికా సుప్రీంకోర్టులో నైజీరియన్ వంటమనిషి ఆశ్రయంపై కీలక విచారణ! రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి బీజేపీకి భయం తిరుపతమ్మ అమ్మవారి నిత్య అన్నప్రసాద వితరణకు భక్తుల విరాళం ఐటిఐ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన పాతపట్నం లో 31యంపిటిసి లు జనసేన కు కేటాయించండి. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగితే కఠిన చర్యలు వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగన్ ఆదేశిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేస్తా.. మాజీ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్

భూముల రీసర్వే వేగవంతం చేయాలి

Select Suryaa Now
భూముల రీసర్వే వేగవంతం చేయాలి

సూర్య రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో మంగళవారం సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు జరిగిన రీసర్వే పనుల పురోగతిపై ఆరా తీశారు.

​- క్షేత్రస్థాయిలో సంయుక్త సర్వే చేయాలి

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల సరిహద్దుల నిర్ధారణ కోసం సర్వే, ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో సంయుక్తంగా సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు. భూములకు సంబంధించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పక్కాగా సేకరించి కంప్యూటరీకరించాలని సూచించారు. రీసర్వే పనులు జరుగుతున్న గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారితో పాటు డీఐలు స్వయంగా పర్యటించి పరిశీలన జరపాలన్నారు.పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు లైసెన్స్‌డ్ సర్వేయర్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రికార్డుల నమోదులో పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.