విద్యార్థులకు విపత్తు నివారణ అవగాహన సదస్సు
పాలకొండ, సూర్య : మేరా యువ భారత్ పార్వతిపురం, పాలకొండ అగ్నిమాపక శాఖ మరియు నవ యువ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ విపత్తు నివారణ దినోత్సవం సందర్భంగా పాలకొండ మండలం, అట్టలి గ్రామంలోని సెయింట్ డొమినిక్ పాఠశాలలో విపత్తు నివారణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలకొండ అగ్నిమాపక కేంద్ర అధికారి జామి సర్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై విపత్తుల సమయంలో సమయస్ఫూర్తి, సురక్షిత ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వరదలు, ప్రమాదాల సమయంలో పాలకొండలో అందుబాటులో ఉండే సురక్షిత ప్రాంతాల వినియోగం, ప్రాణరక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ స్టెల్లా ఒ.పి, నవ యువ సేవా సంఘం అధ్యక్షుడు సురేంద్ర కుమార్, అగ్నిమాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.