స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం... టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు
స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం... టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు
రామగిరి మేజర్ న్యూస్: స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం అని రామగిరి మండల టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు పేర్కొన్నారు.మంగళవారం స్థానిక సంస్థల ఎలక్షన్ల గురించి పేరూరు పంచాయతీ కూటమి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ టిడిపి కార్యకర్ తల సమన్వయంతో పనిచేస్తూ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించేలా తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బడముద్దుల రంగయ్య , మండల బూత్ క్లస్టర్ ఇంచార్జ్ శివకుమార్, మాదాపురం శంకర్, రామగిరి తెలుగుదేశం మండల కన్వీనర్ సుధాకర్ మరియు పేరూరు పంచాయతీ సంబంధించిన తెలుగుదేశం కార్యకర్తలు హాజరు కావడం జరిగినది.