విగ్రహాలను కూల్చగలరేమో.. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని చెరిపేయలేరు
దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి…
లింగారెడ్డిగూడెం ఉపసర్పంచ్ అశోక్ డిమాండ్…
మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం హేయమైన చర్యలని విగ్రహాలను కూల్చగలరేమో కానీ ఆమె పోరాట చరిత్రను చెరపలేరని లింగారెడ్డిగూడెం ఉపసర్పంచ్, కాంగ్రెస్ యువ నాయకుడు, రజక సంఘం నేత లింగారెడ్డిగూడెం అశోక్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ధ్వంసాన్ని తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం యావత్ బహుజన సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి అరెస్టు చేసి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న పోరాట యోధురాలని ., అణగారిన వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఐలమ్మ త్యాగాలు, పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అలాంటి మహనీయురాలి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రజక సమాజంతో పాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ హక్కులు, ఆత్మగౌరవం కోసం చైతన్యవంతమవుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని అశోక్ అన్నారు. మహనీయుల విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన వారి చరిత్రను చెరిపివేయలేరని, ప్రజల హృదయాల్లో నిలిచిన వారి పోరాట స్ఫూర్తిని అణచివేయలేరని స్పష్టం చేశారు. ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన చేతులకు శిక్ష పడాలి.. ఆమె ఆశయాలు మాత్రం ప్రతి గుండెలో సజీవంగా నిలవాలి అని అశోక్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాలని కోరారు.
వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీకలైన మహనీయులను గౌరవించాలని, విగ్రహ ధ్వంసానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని లింగారెడ్డిగూడెం అశోక్ డిమాండ్ చేశారు..
M. నరసింహ రెడ్డి మేజర్ న్యూస్ ఫరూక్ నగర్…..