BREAKING
సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే? చీరాల 43వ వార్డులో ఆమంచి కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారం బోయింగ్‌కు ఊరట...సెప్టెంబర్‌లో అత్యధికంగా 57 విమానాల డెలివరీ! వాల్‌మార్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ మొగిలిచర్లలో టీడీపీలోకి చేరిన 6 కుటుంబాలు లింగసముద్రం (

యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Select Suryaa Now
యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

 

- 'గాలి వార్తలు' అంటూ జర్నలిస్టులను అవమానించిన గుండా మల్లయ్య 
 
యాదగిరిగుట్ట :దగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్ధాన ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం పట్టణంలోని ప్రెసిడెన్షియల్ సూట్ లో జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల‌ సమావేశంలో ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించిన అంశాల గురించి చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా గత నెల దేవస్ధాన అభివృద్ధి కోసం విరాళాల సేకరణ పేరుతో కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గురించి విలేకరులు ప్రస్తావించగా బోర్డు సభ్యుడు అయినటువంటి గుండా మల్లయ్య గుప్తా గాలి వార్తలు, గాలి మాటలు మాట్లాడవద్దంటూ విలేకరులను కించపరుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వెంటనే విలేకరులంతా లేచి ట్రస్టు బోర్డు సభ్యుడై ఉండి మీడియాలో వచ్చిన వార్తల గురించి ప్రశ్నిస్తే ప్రశ్నించిన వారిని కించపరచడం సరికాదని నిరసన తెలిపారు. అదే సమయంలో బోర్డు చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కలగజేసుకొని విలేకరులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.