BREAKING
గాంధీ భవన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు కొయ్యలగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో - పేషెంట్ ప్రాణాలతో చెలగాటం జనసేన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు- బాక్సాఫీస్ వద్ద కీర్తి సురేష్ ‘డోరతీ’ హవా.. 19 రోజుల్లో మైండ్ బ్లోయింగ్ వసూళ్లు! కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500...ఆర్జీ-3లో ఐఎన్టీయూసీ పాలాభిషేకం *ఘనంగా పోసిన చెంచు రామారావు జన్మదిన వేడుకలు* యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడలపై మక్కువ చూపాలి... బాక్సాఫీస్ వద్ద విజయ్ సేతుపతి ‘బత్తా’ జోరు.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం! వేసవికి ముందే విద్యుత్‌ ఏర్పాట్లు పూర్తి చేయాలి ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన పరిపాలన అందించాలి మండల టిడిపి అత్యవసర సమావేశం.. సింగరేణిలో డిజిఎం బి.వి సేవలు మరువలేనివి సాంకేతికతపై పట్టు సాధించండి...ఉన్నత శిఖరాలను అధిరోహించండి శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం ఓటింగ్ ట్రెండ్.. టాప్‌లో రోహిత్, డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

ఉనుదుర్రులో రూ.16.50 లక్షలతో రహదారి పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
ఉనుదుర్రులో రూ.16.50 లక్షలతో రహదారి పనులకు శంకుస్థాపన

ఉండి, మేజర్ న్యూస్:ఉండి మండలం ఉనుదుర్రు గ్రామంలో రహదారుల అభివృద్ధిలో భాగంగా మంగళవారం రూ.16.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు టీడీపీ ఉండి మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు తెలిపారు. ఇందులో రూ.10 లక్షలతో సీసీ రోడ్లు, రూ.6.50 లక్షలతో గ్రావెల్ రోడ్లు నిర్మించనున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రజల దైనందిన జీవితానికి ఎంతో అవసరమన్నారు. గ్రామాల్లో రహదారులు మెరుగుపడితే ప్రజలకు రాకపోకలు సులభతరం కావడంతో పాటు రైతులు, కూలీలు, విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారులపై ప్రయాణించేందుకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు రోడ్ల నిర్మాణం దోహదపడుతుందని అన్నారు.గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంజూరైన నిధులతో చేపట్టే పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు.ఉనుదుర్రు గ్రామంలో రహదారుల నిర్మాణ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉనుదుర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు బండారు వీర రాఘవులు, ఉపాధ్యక్షులు కూనపరాజు వర్మ, స్థానిక టీడీపీ నాయకులు మాండ్రు ఆనంద్, మాండ్రు సందీప్ , కార్యకర్తలు పాల్గొన్నారు.

 

 రిపోర్టర్ ఈతకోట రాజు ఉండి పశ్చిమగోదావరి జిల్లా