కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి
మదనపల్లె,మేజర్ న్యూస్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె నందు వెలసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో దసరా (శరన్నవరాత్రి) ఉత్సవాలు,30వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా రెండవ రోజైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారు కుంకుమ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకము,తీర్థప్రసాద వినియోగము,అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,మహా మంగళహారతిని భక్తిశ్రద్దలతో నిర్వహించారు.ఈ వేడుకలకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్,కమిటీ గౌరవ అధ్యక్షులు రామిశెట్టి నీలకంఠ,గౌరవ ఉపాధ్యక్షులతోపాటు కోశాధికారి రామిశెట్టి రత్నమయ్య,కార్యదర్శి బండి పవన్ కుమార్ మరియు పాలకవర్గ సభ్యులు ఈ ఏడాది అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారన్నారు.విద్యుత్ దీపాలు,అనేక రకాల పుష్పాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించడం జరిగిందన్నారు.ఈ నెల 20వ తేదీ వరకు వివిధ అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారన్నారు.దాతల సహకారంతో ప్రతిరోజు భక్తులకు అల్పాహారం అందజేయడం జరుగుతోందన్నారు.శ్రీ చౌడేశ్వరి దేవి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు,అష్టైశ్వర్యాలు పొందాలని ఆకాంక్షించారు.అదేవిధంగా భక్తులు నవరాత్రి ఉత్సవాలకు పెద్దఎత్తున తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మోడెం వెంకటరమణ,మోడెమ్ సిద్దప్ప,ఉప్పు రామచంద్ర,ఆర్.నీలకంఠ,బి.నాగరాజు,జి.లక్ష్మీనారాయణ,కె.వి నాగరాజు,ఆర్.కె మోహన,ఉప్పు శ్రీనివాసులు,ఆలయ కమిటీ సభ్యులు,తొగటవీర క్షత్రియ కుల బాంధవులు,భక్తులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లె నియోజకవర్గం ఇంచార్జి