ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి
- అంగరంగ వైభవంగా తీదేడు రామాలయంలో ధ్వజస్తంభం, ఆంజనేయస్వామి విగ్రహ పునః ప్రతిష్ట
- భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. పాల్గొన్న గ్రామస్తులు, భక్తులు
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్ .. చింతపల్లి మేజర్ న్యూస్.. నల్లగొండ జిల్లా:
ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల .స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తీదేడు గ్రామంలోని శ్రీరామాలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనతో పాటు ఆంజనేయస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు,ప్రత్యేక పూజల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది.గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల. స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ...గ్రామంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.దేవాలయాలు మన సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకలని, భక్తి భావంతో నిర్వహించే ఇలాంటి కార్యక్రమాలు గ్రామ ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.గ్రామ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత
గ్రామ ప్రజలందరి సహకారంతో తీదేడు గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు, గ్రామంలోని దేవాలయాల పరిరక్షణకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. భవిష్యత్తులోనూ గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఐకమత్యాన్ని చాటే కార్యక్రమాలను నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.తీదేడు గ్రామంలో భక్తి, ఆధ్యాత్మిక సందడి నెలకొందని గ్రామ ప్రజలు స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్,గ్రామ పాలక వర్గం,మాజీ సర్పంచ్లు,మాజీ ఉప సర్పంచ్లు,మాజీ వార్డు సభ్యులు,గ్రామ ప్రజలు,గ్రామ యువకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.