BREAKING
ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ లేదు.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్! ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డర్బన్ టెస్టు: నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ 221/5, ఆధిక్యం 327 రెన్‌షా మరో అర్ధసెంచరీ.. నోర్కియా బౌలింగ్‌లో క్యారీ బౌల్డ్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్ రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్‌, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు. వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స నాణ్యతకు నామాలు..! పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం! సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? దసరా కానుకగా రాబోతున్న రామాయణ సెకండ్ ట్రైలర్.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!

ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి

Select Suryaa Now
ఓవర్‌లోడ్‌తో వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయి.. అధిక సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయండి

దుద్యాల్, మేజర్ న్యూస్, (అక్టోబర్ 12): దుద్యాల్ మండల కేంద్రం శివారులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్ కారణంగా వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్‌పై అధిక భారం పడటంతో వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యను గతంలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించలేదని వాపోయారు. ప్రస్తుతం చేతికి వచ్చిన వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసి, వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు శ్రీకాంత్, మహేందర్, సాయిలు, వీరేష్, శివ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

రిపోర్టర్: రమేష్, దుద్యాల్, వికారాబాద్ జిల్లా.