BREAKING
ప్రభాస్ పుట్టినరోజుకు టీజర్ లేదు.. అభిమానులకు మైండ్ బ్లోయింగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన మేకర్స్! ఎల్ నినో ప్రభావ ఉపశమానికి ఆరుతడి పంటలు మేలు చేస్తాయి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డర్బన్ టెస్టు: నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆసీస్ 221/5, ఆధిక్యం 327 రెన్‌షా మరో అర్ధసెంచరీ.. నోర్కియా బౌలింగ్‌లో క్యారీ బౌల్డ్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా సోమిరెడ్డీ...కాకాణి గోవర్ధన్‌రెడ్డి బహిరంగ సవాల్ పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ల ఆవిష్కరణ కార్యక్రమం ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్ రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ ఏదులాపురం అభివృద్ధికి మంత్రి పొంగులేటి ప్రత్యేక కార్యాచరణ నారాయణరావుపేట పంచాయతీ అక్రమాలపై విచారణకు డిమాండ్. జిల్లా కలెక్టర్‌, డిపిఓకు ఉప సర్పంచ్,వార్డు సభ్యుల ఫిర్యాదు. వృద్ధురాలికి విజయవంతంగా రెండు భుజాల మార్పిడి శస్త్రచికిత్స నాణ్యతకు నామాలు..! పారిశ్రామిక వాడ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మిషన్ మార్చ్‌తో నూరు శాతం లక్ష్యం! సింగూరు ప్రాజెక్ట్‌పై సర్కార్‌ యాక్షన్ ప్లాన్ ఏంటి? దసరా కానుకగా రాబోతున్న రామాయణ సెకండ్ ట్రైలర్.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు!

పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి

Select Suryaa Now
పిల్లలను చెరువులు, కాలువల వద్దకు వెళ్ళనివ్వద్దు - MRO విజ్ఞప్తి

దసరా సెలవులు నేపద్యంలో పిల్లలను చెరువులు, కాలువలు, సముద్రాలు మరియు నీటి వనరుల వద్దకు వెళ్లనివ్వొద్దని అద్దంకి తహసిల్దార్ శ్రీ చరణ్ తెలిపారు. అలాంటి ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడి మరణిస్తున్న ఘటనలు జరుగుతున్నాయని, దీనిపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ విషయంపై జిల్లాకలెక్టర్  కూడా కఠిన ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లను చెరువులు, కాలువల వద్దకు వెళ్లకుండా మరియు ఈతకు వెళ్లకుండా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపలాగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చెరువులు, కాలువల వద్ద డేంజర్ బోర్డులను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పంచాయతీ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో అధికారులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని MRO విజ్ఞప్తి చేశారు.