నాగిరెడ్డిపేట లో ప్రజావాణికి ఒక్క ఫిర్యాదు.
సూర్య, నాగిరెడ్డి పేట్:మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు కరవయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకే ఒక్కఫిర్యాదు అందినట్లు ఎంపీడీవో గంగాధర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటరెడ్డి, ఎంపీవో ప్రభాకరాచారి, తోపాటు మండల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.