పులి శాంతిని పరామర్శించిన మాజీ ఎమ్యెల్యే కదిరి
పులి శాంతి ని పరామర్శించిన.. మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పులి శాంతి ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కనిగిరి మాజీ ఎమ్మెల్యే ,విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు కదిరి బాబురావు సోమవారం కనిగిరి లోని శాంతి నివాస గృహానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకొని ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పులి రాధా కృష్ణారెడ్డి ,సిరుపా గోవర్ధన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ షేక్ ఫయాజ్, పోలిచర్ల రహీమ్ బాషా, రషీద్,మార్తల రామురెడ్డి, హరి, షేక్ షరిఫ్, రహిమాన్, కరీముల్లా, కె వెంకట నరసయ్య, ఎస్ అంజనాద్రి, తదితరులు పాల్గొన్నారు.