BREAKING
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు! కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్ర భుజంగ్ రావ్ కు సన్మానం ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' నటి సామ్.. క్యూట్ ఫోటోలు వైరల్! ఇర్విన్ రిజర్వాయర్ రద్దుకై ప్రజావాణిలో భూనిర్వాసిత రైతుల వినతి పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకం పెంచేలా సమస్యల పరిష్కారం ఉండాలి; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొనసాగుతున్న చేరికలు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం తమిళ దర్శకుడితో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్! చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి నిహారిక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి ప్రజావాణికి 12 దరఖాస్తులు శ్రీరాముడి వేషధారణలో అనుపమ ఫేమ్ గౌరవ్ ఖన్నా.. రణ్‌బీర్ కపూర్‌కంటే అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు!

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణ

Select Suryaa Now
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక  కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ ఓ. ఆనంద్‌  ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ నిర్వహణ

అనంతపురం బ్యూరో : ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు అనంతపురం కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆశతో వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌ అర్జీలను స్వీకరించారు.

కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భూ, రెవెన్యూ తదితర సమస్యలతో పాటు వివిధ అంశాలపై అర్జీదారులు తమ వినతులను అధికారులకు అందజేశారు. ప్రజలు సమర్పించిన అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకునేలా ఈ వేదికను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ సి. విష్ణుచరణ్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోల, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్‌, రామ్మోహన్‌, వెంకట నారాయణ, రమేష్‌రెడ్డి, కిరణ్మయి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.