BREAKING
రోగం వస్తే దూర ప్రాంతాలకు వెళ్లాలా? పేదవాడు వైద్యం కోసం అప్పులపాలవ్వాలా? ఇంకెన్నాళ్లు నేరేడుచర్ల ప్రజలకు ఈ వైద్య కష్టాలు? నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయాలి బి ఆర్ ఎస్ నేత రాపోలు నవీన్ కుమార్ ధనలక్ష్మి దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలన మంచిర్యాల జిల్లాలో 289 ఉద్యోగాలు ​కొత్తపేటలో భక్తి, సేవల సమ్మేళనం.. ఉచిత వైద్యశిబిరం, అన్నదాన కార్యక్రమం విద్యుత్ చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. మండలంలో విద్యుత్ శాఖ అధికారులు మెరుపు దాడులు. 'గరివిడి లక్ష్మి' ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్.. అక్టోబర్ 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్! గాయత్రి దేవి అలంకారంలో తాళమ్మ మొయిదలో 20 కుటుంబాలు టిడిపిలో చేరిక ఈ-ఆటోల ప్రారంభోత్సవం పాల్గొన్న ప్రభుత్వ విప్ బొలిశెట్టి దేవీ నవరాత్రుల సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ధైర్యంగా ఉండాలని భరోసా మహిళలకు అండగా జెండర్ రిసోర్స్ సెంటర్ 'ది ట్రైటర్స్ తెలుగు' స్ట్రీమింగ్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో క్లోక్‌మెన్ హల్‌చల్! యాదాద్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడి వివాదాస్పద వ్యాఖ్యలు

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మానసా దేవి!

Select Suryaa Now
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మానసా దేవి!

వరికుంటపాడు, మేజర్ న్యూస్  :     కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులచే పూజలందుకుంటున్న మానసా దేవి అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరికుంటపాడు మండల పరిధిలోని తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో వెలసి ఉన్న మానసా దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని చంద్రఘంట అలంకారంలో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. భక్తిశ్రద్ధలతో సాగుతున్న శరన్నవరాత్రి వేడుకలతో తూర్పు రొంపిదొడ్ల గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఆలయాన్ని పలు రకాల పుష్పాలు విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.