కొరిశపాడు ఎస్సైగా సంపత్ కుమార్.
కొరిశపాడు ఎస్సైగా సంపత్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. చీమకుర్తిలో పనిచేస్తున్న ఆయన బదిలీపై కొరిశపాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొరిశపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నేరాల నియంత్రణపై నిరంతర నిఘా పెంచుతామన్నారు.