BREAKING
ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్‌ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు! కుంకుమ అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీచౌడేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కుమ్ర భుజంగ్ రావ్ కు సన్మానం ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న 'ఇరుముడి' నటి సామ్.. క్యూట్ ఫోటోలు వైరల్! ఇర్విన్ రిజర్వాయర్ రద్దుకై ప్రజావాణిలో భూనిర్వాసిత రైతుల వినతి పోలీసుల పట్ల ప్రజలలో నమ్మకం పెంచేలా సమస్యల పరిష్కారం ఉండాలి; జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. కామారెడ్డిలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య, దోపిడీ చేసి హత్య చేసిన భార్య భర్తల అరెస్ట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో కొనసాగుతున్న చేరికలు షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల ఆస్తి నష్టం తమిళ దర్శకుడితో రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ.. ఇండియానా జోన్స్ తరహాలో భారీ అడ్వెంచర్ థ్రిల్లర్! చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి -జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ న్యాయమూర్తి నిహారిక ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా జీసీసీ బాధిత కార్మికులకు న్యాయం చేయాలి ప్రజావాణికి 12 దరఖాస్తులు శ్రీరాముడి వేషధారణలో అనుపమ ఫేమ్ గౌరవ్ ఖన్నా.. రణ్‌బీర్ కపూర్‌కంటే అద్భుతంగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ ప్రశంసలు!

అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు

Select Suryaa Now
అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలనకు ఏర్పాట్లు

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీకి అనుగుణంగా దాదాపు 11 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే ప్రక్రియ ప్రారంభించిన కూటమి ప్రభుత్వం.   ఎలాంటి వివాదాలు లేని అగ్రిగోల్డ్ భూములను విక్రయించి దాని ద్వారా వచ్చే మొత్తం బాధితులకు చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం. అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన చేయాలని సిఐడి ని ఆదేశించింది.   దీనిలో భాగంగా సిఐడి ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీ నుండి అన్ని జిల్లా కేంద్రాలలో, బాండ్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది.   నెల్లూరు లోని పోలీస్ గ్రౌండ్ లో గల ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో, ఉమ్మడి నెల్లూరు జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం ఈనెల 9 వ తేదీ నుండి జరుగుతుంది.  ప్రస్తుతం సర్వేపల్లి నియోజకవర్గం  వారి బాండ్లు పరిశీలిస్తున్నారు.ఈనెల 14 వ తేదీ నుండి కోవూరు నియోజకవర్గం కు చెందిన వారి బాండ్లు పరిశీలన జరుగుతుంది..ఈనెల 14 న కోవూరు మండలం,15 న బుచ్చిరెడ్డి పాలెం,16 న ఇందుకూరుపేట,17 న విడవలూరు,కొడవలూరు కు చెందిన వారి బాండ్లు పరిశీలిస్తారు.కావున అగ్రిగోల్డ్ బాధితుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  చేజర్ల వేంకటేశ్వర రెడ్డి

నెల్లూరు  లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ   రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ లో డబ్బులు కట్టి నష్ట పోయిన బాధితులు అందరికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేస్తామని తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  దాదాపు 11 లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలని భావించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు  5 గురు మంత్రులతో కమిటీ వేశారు. ఆ మంత్రుల కమిటీ అనేక మార్లు సమావేశం అయ్యి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయటానికి ఉన్న మార్గాలన్నిట్టినీ అధ్యయనం చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చారు.  ఆ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఎటువంటి వివాదాలు లేని అగ్రిగోల్డ్ కు సంబంధించిన 6330 ఎకరాల భూమి సిఐడి వారి స్వాధీనంలో ఉంది.   ఎటువంటి వివాదాలు లేని అగ్రిగోల్డ్ భూములను విక్రయించి దాని ద్వారా వచ్చే మొత్తం అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని ముఖ్యమంత్రి గారు  ఆదేశాలు ఇచ్చారు.  దానిలో భాగంగా  అగ్రిగోల్డ్ బాధితుల బాండ్లను జిల్లాల వారీగా పరిశీలించి అర్హుల జాబితా తయారు చేయమని సిఐడి ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.   దీనిలో భాగంగా సిఐడి ఆధ్వర్యంలో ఈనెల 9 వ తేదీ నుండి అన్ని జిల్లా కేంద్రాలలో, బాండ్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది.నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో, ఉమ్మడి నెల్లూరు జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన కార్యక్రమం జరుగుతుంది.  ఈనెల 14 వ తేదీ నుండి కోవూరు నియోజకవర్గం కు చెందిన వారి బాండ్లు పరిశీలన జరుగుతుంది..ఈనెల 14 న కోవూరు మండలం,15 న బుచ్చిరెడ్డి పాలెం,16 న ఇందుకూరుపేట,17 న విడవలూరు,కొడవలూరు కు చెందిన వారి బాండ్లు పరిశీలిస్తారు.  కావున అగ్రిగోల్డ్ బాధితుల తమ బాండ్లను ను తీసుకొచ్చి,  నెల్లూరు లోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో సిఐడి అధికారులు వద్ద పరిశీలన చేయించుకొని,నమోదు చేయించుకోవాలి.  ఈ బాండ్ల పరిశీలన కార్యక్రమం నవంబర్ 17 వ తేదీ వరకూ జరుగుతుంది. ఏ తేదీన ఏ మండలం వారు వారు రావాలో అధికారులు ముందుగానే షెడ్యూలు ఇచ్చి ఉన్నారు.ఆ షెడ్యూలు ప్రకారం బాధితులు వచ్చి తమ బాండ్లు పరిశీలన చేయించుకోవాలి.  అగ్రిగోల్డ్ బాధితుల తమ దగ్గర ఉన్న ఒరిజినల్ బాండ్,సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఒరిజినల్ బాండ్ కలర్ zerox కాపీ,గుర్తిపు కార్డు,బ్యాంకు అకౌంట్ వివరాలు,పాస్ పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుపోవాలి.  అదేవిధంగా డిఫాజిట్ దారు మరణించి ఉంటే మరణ ధృవీకరణ పత్రం,నామిని లేదా చట్టబద్ధమైన వారసులు గుర్తింపు పత్రం తీసుకొని పోవాలి. ఏజెంట్లు అయితే ఏజెంట్ కోడ్ గుర్తిపు పత్రాలు,మరియు బ్యాంక్ వివరాలు తీసుకెళ్ళాలి.  అగ్రిగోల్డ్ లో డబ్బులు కట్టి ఆ డబ్బులు తిరిగి రాక గత 10 సంవత్సరాల గా ఇబ్బందులు పడుతున్న  అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం వలన ఉపశమనం కలగబోతుంది.ఇందుకు గాను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.