డబుల్ అలాట్మెంట్లో గడబిడ * బి ఆర్ఎస్ కౌన్సిలర్ ను లాక్కెళ్ళిన పోలీస్ లు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు డిప్ కార్యక్రమం వెలమ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఇతర అధికారుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కౌన్సిలర్ తిమ్మాజిపేట పాండు మాట్లాడటం నివాస్పదంగా మారింది. దీంతో అతని పోలీసులు సభా వేదికపై నుండి తీసుకువెళ్లి పోలీస్ వాహనంలో ఎక్కించారు. స్టేషన్కు తీసుకువెళ్లి మధ్యాహ్నం తర్వాత విడుదల చేశారు. ఇండ్ల కేటాయింపు పై కలెక్టర్ హేమంత్ కేశవ్ వివరణ ఇస్తుండగా బి.ఆర్.ఎస్ కౌన్సిలర్ పాండు ఆ విషయంలో అభ్యంతరాలు తెలిపేందుకు తనకు మైకు కావాలని డిమాండ్ చేశారు. డబుల్ ఇండ్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని అసంపూర్తి పనులతో ఉన్నాయి ఇండ్ల కేటాయింపు సరికాదన్నది పాండు వాదాన.ఇండ్ల కేటాయింపుకు సంబంధించి మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్ అందరికీ సమాచారం ఇవ్వడం జరిగిందని అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడేంటన్నది అధికారుల వాదన. కలెక్టర్ సమక్షంలోనే విపక్ష కౌన్సిలర్ పాండును పోలీసులు లాక్ కెళ్ళడం చర్చి నియాంశంగా మారింది.
పి. విజయ్ కుమార్,నాగర్ కర్నూల్ ప్రతినిధి, సూర్య న్యూస్