చేవెళ్లలో దారుణం.. యువతిపై దాడి!
మియాపూర్‌కు చెందిన యువతిగా అనుమానం..
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జగూడ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఓ యువతి తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉండటం కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పొలాల వద్దకు వెళ్లిన రైతులు యువతి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి తలపై తీవ్ర గాయాలున్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను స్థానిక పీఎంఆర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువతి హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందినదిగా స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(రంగారెడ్డి మేజర్ న్యూస్)