BREAKING
ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు! మయూరి అబ్దుల్లా ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రికులకు హిందూ సోదరులు ఘన సన్మానం గిరిజన యువతకు పోలీసు ఉద్యోగాల ఉచిత శిక్షణ దరఖాస్తుల గడువు రేపటితో ముగింపు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు.. మహాధర్నాకు సర్వం సిద్ధం! కొత్తూరు బస్టాండ్ వద్ద ఘోర ప్రమాదం అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలు.. మామగారి కోసం ఐశ్వర్య రాయ్ ఎమోషనల్ పోస్ట్! సేవల దిగుమతులపై జీఎస్టీ ఈ-ఇన్‌వాయిసింగ్ పరిధి విస్తరణ?: నమోదుకాని విదేశీ కంపెనీలకూ వర్తింపజేసే యోచనలో కేంద్రం! విత్తనాలు, మద్దతు ధరలు, దాల్ మిల్లుల పునరుజ్జీవనం ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు: గాయత్రీ దేవి అలంకారంలో దుర్గమ్మ తెల్లవారుజాము 4 గంటల నుంచే దర్శనాలు. క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు రూపాయి రక్షణకు ఆర్‌బీఐ కీలక అడుగు: మూడు ప్రభుత్వ చమురు కంపెనీల డాలర్ అవసరాలను నేరుగా తీర్చేందుకు ప్రత్యేక విండో! కాంగ్రెస్ నిరసన ర్యాలీ ఎఫెక్ట్: ఢిల్లీ మెట్రోలోని 6 కీలక స్టేషన్లలో రాకపోకలు తాత్కాలికంగా బంద్! సిరిమానోత్స‌వానికి ఘ‌నంగా ఏర్పాట్లు... మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్‌ సిరిమాను చెట్టుకు సంప్ర‌దాయ‌బ‌ధ్దంగా పూజ‌లు రష్యా నుంచి డీజిల్ కొనుగోలుపై ట్రంప్ కార్యాచరణ ఏమిటి?: అమెరికా స్పష్టత కోసం ఎదురుచూస్తున్న భారత్! ఫ్రాన్స్‌లో రాజకీయ విభజన.. రన్-ఆఫ్‌కు లీ పెన్, మెలాంచన్ ఆర్‌బీఐ తాత్కాలిక రక్షణ చర్యలతో రూపాయి కోలుకున్నా.. కొనసాగనున్న మారకపు విలువ ఒత్తిడి: ఆర్థికవేత్తల విశ్లేషణ!

ఆల్ ది బెస్ట్ విష్ణన్న.....

Select Suryaa Now
ఆల్ ది బెస్ట్ విష్ణన్న.....

*ఆల్ ది బెస్ట్ విష్ణన్న....*

*అమ్మవారి దయవల్ల అంతా శుభమే జరుగుతుంది*

*నాణ్యమైన మిఠాయిలకు శారదా స్వీట్ హౌస్ వేదిక కావాలి*

*వ్యాపారంలో దినదినాబివృద్ధి చెందాలి - టీడబ్ల్యూజేఎఫ్ షాద్ నగర్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్*

షాద్‌నగర్ పట్టణంలోని మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శారదా స్వీట్ హౌస్ నాణ్యమైన మిఠాయిలకు వేదికగా నిలిచి, వ్యాపార రంగంలో దూసుకుపోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) షాద్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ ఆకాంక్షించారు. కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన గుండు విష్ణు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఈ నూతన స్వీట్ స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమవారం రాఘవేందర్ గౌడ్ సదరు కేంద్రానికి విచ్చేసి, తన స్వగ్రామానికి చెందిన విష్ణును ప్రత్యేకంగా కలిసి అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ పవిత్రమైన దేవి నవరాత్రులు ప్రారంభమైన శుభ తరుణంలో ఈ నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులతో అంతా శుభమే జరుగుతుందని, శారదా స్వీట్ హౌస్ వినియోగదారులకు నాణ్యమైన మిఠాయిలను అందిస్తూ వ్యాపారంలో దినదినాభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగెం గ్రామ మాజీ ఎంపీటీసీ పుట్టోని గూడెం యాదయ్యతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్, షాద్ నగర్