**పెద్దాయిపల్లిలో విషాదం.. పదేళ్ల బాలిక మృతి**
సూర్యరాజంపేట:రాజంపేట మండలంలోని పెద్దాయిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల మహాన్విత (10) ఆదివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మహాన్విత నాలుగో తరగతి చదువుతోంది. చిన్న వయసులోనే గుండెపోటుతో బాలిక మృతి చెందడంతో తల్లిదండ్రులు గాలి పవన్ కుమార్, లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది.