ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు.. మహాధర్నాకు సర్వం సిద్ధం!
న్యూఢిల్లీ:దేశ రాజధానిలో ప్రతిపక్షాలు తలపెట్టిన మహాధర్నాలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీకి పయనమయ్యారు. గోవా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు రాష్ట్రం నుంచి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి, ప్రతిపక్షాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహాధర్నాలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా జాతీయ స్థాయి నాయకులతో భేటీలు, రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.