BREAKING
ఆర్‌బీఐ తాత్కాలిక రక్షణ చర్యలతో రూపాయి కోలుకున్నా.. కొనసాగనున్న మారకపు విలువ ఒత్తిడి: ఆర్థికవేత్తల విశ్లేషణ! ఇంద్రకీలాద్రిపై భక్తులకు వైద్య సేవలు ఉదయం నిద్ర లేవగానే ఇలా చేస్తే చాలు.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు! ఐపీవో మార్కెట్లో పండుగ సందడి: ఈ వారంలో ఏకంగా ₹11,000 కోట్లకు పైగా నిధుల సమీకరణకు 8 పబ్లిక్ ఇష్యూలు సిద్ధం! పారిస్ మోటార్ షోలో ఈయూ, చైనా ఆటో దిగ్గజాల హోరాహోరీ భారత్-బ్రిటన్ చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం : 2040 నాటికి ఏటా £25.5 బిలియన్ల (₹3.26 లక్షల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్య వృద్ధి! టాలీవుడ్‌లో ఊహించని పరిణామం.. దేవిశ్రీ ప్రసాద్‌తో ఇరవై ఏళ్ల బంధానికి బ్రేక్ వేసిన సుకుమార్! చేవెళ్లలో దారుణం.. యువతిపై దాడి! ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ల ఇన్సూరెన్స్ పెట్టుబడులపై ముప్పు ఆర్‌బీఐ ఆంక్షల వేళ బ్యాంకుల సరికొత్త అడుగు: ఎగుమతి, దిగుమతిదారుల కోసం సులభతర ఫారెక్స్ హెడ్జింగ్ మార్గాలు! హద్దులు చెరిపేస్తున్న ఐకాన్ స్టార్.. సినిమాలో రిస్కీ యాక్షన్ స్టంట్స్‌తో అల్లు అర్జున్ ఫైట్స్! హైబ్రిడ్, ఈవీ వాణిజ్యంపై చైనా-ఈయూ విస్తృత చర్చలు ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి! స్వీడన్ టెలికాం దిగ్గజం 'టెలియా' సంచలన నిర్ణయం బీసీలను మభ్యపెడుతున్నారని ఆరోపణ.

విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు ... రాజంపేటలో రైతుల ధర్నా..

Select Suryaa Now
విద్యుత్ కోతలతో రైతుల అవస్థలు ... రాజంపేటలో రైతుల ధర్నా..

సూర్య రాజంపేట;వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రాజంపేట మండల కేంద్రంలో రైతులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి రోజుకు కేవలం ఆరు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుండటంతో పంటలకు నీరందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకుడు చింతల స్వామి మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సక్రమంగా విద్యుత్ అందకపోవడంతో బోరు మోటార్లు కాలిపోతున్నాయని, పంటలకు అవసరమైన సమయంలో నీరు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, రైతులు పెట్టిన పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు ఇప్పటికే వ్యవసాయ పెట్టుబడుల భారంతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ కోతలు మరింత నష్టాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. పంటలకు సకాలంలో నీరందించాలంటే నిరంతర విద్యుత్ సరఫరా ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని చింతల స్వామి డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించి పంటలను కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్నా ఏఈకి నాందేవ్ మరియు రైతులకు కరెంటు ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించడంతో ఉద్రిక్తత నెలకొంది