రైతు నేస్తం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.. ఏడిఏ శోభారాణి
నేడు సోమవారం పట్టణ కేంద్రంలోని రైతు వేదిక, మండలంలోని ఆకుతోటపల్లి, రాంనుంతల రైతు వేదికలలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి ప్రసంగించానున్న రైతు నేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏడిఏ శోభారాణి చెప్పారు. అందులో భాగంగా రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న రబీ సీజన్ కు పంటల ప్రణాళిక, పంటల వైవిద్దీకరణ, అనువైన పంటల ఎంపిక, పంటల సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె వివరించారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ఎ. చంద్రశేఖర్: మేజర్ న్యూస్, ఆమనగల్లు.