వీఓ మహిళా భవన నిర్మాణానికి భూమి పూజ-సర్పంచ్ బానోతు బాలు నాయక్
స్టేషన్ ఘనపూర్, మేజర్ న్యూస్, మండలంలోని జిట్టెగూడెం గ్రామంలో సర్పంచ్ బానోతు బాలు నాయక్ దుర్గామాత వీఓ సంఘం మహిళ భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వీఓ మహిళ సంఘం వారు సొంత భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అందులో భాగంగా మాజీ వైస్ ఎంపీపీ చాల్లా సుధీర్ రెడ్డి వాళ్ళ తండ్రిగారైన
చల్లా ప్రతాప్ రెడ్డి జ్ఞాపకార్ధం దానం ఇచ్చిన నాలుగు గుంటల స్థలంలో కొంత గ్రామ పంచాయతీ వ్కార్యాలయ భవనానికి పోగా మిగిలిన దానిలో 10 లక్షల
విబిజి రామ్ జి నిధుల ద్వార నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నునావత్ రజితరవిందర్, వార్డు సభ్యులు, వీవోఏ
లావుడ్య కవిత ,అధ్యక్షురాలు బానోతు పుష్ప,ఉపాద్యక్షురాలు బాదావత్ సుశీల,
కార్యదర్శి లావుడ్య కొమురమ్మ,సహాయ కార్యదర్శి వాంకుడొతు లక్ష్మీ, కోశాధికారి బానోతు స్వరూప,గ్రామస్తులు పాల్గోన్నారు.
రిపోర్టర్; మోహన్, స్టేషన్ ఘ న్ పూర్, జనగామ జిల్లా