BREAKING
లాస్ ఏంజిల్స్‌లో ఎలక్ట్రిక్ టాక్సీ సేవలను ప్రారంభించిన జీఎస్ఎమ్ మలక్‌పేటలో దివ్యాంగుల నిరసన ఉక్రెయిన్ సైనిక కార్యకలాపాలకు గట్టి ఎదురుదెబ్బ...స్టార్‌లింక్ సేవలను నిలిపివేసిన స్పేస్‌ఎక్స్ దామరకుంటలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు-కనులపండువగా 21 తీరుల పూల గోపురాల ఆవిష్కరణ ఇన్చియాన్ దాడుల్లో బాధితుల సంఖ్య పదికి చేరినట్లు ప్రకటించిన పోలీసులు దక్షిణ కొరియాలో 16 ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ హ్యాకింగ్ ఘటనలు సెప్టెంబర్‌లో 11.39 శాతానికి ఎగబాకిన భారత హోల్‌సేల్ ధరల సూచీ ద్రవ్యోల్బణం వ్యడ్డీ రేట్ల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ విశ్లేషణ ఐపీఓకు ముందే ఫ్యూజన్ సీఎక్స్ దూకుడు: యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా రూ. 315 కోట్ల నిధుల సమీకరణ! చైనాకు చెక్ పెట్టేందుకు వియత్నాంతో యూరోపియన్ యూనియన్ సన్నాహాలు డిజిటల్ సార్వభౌమత్వమే లక్ష్యం: సావరిన్ క్లౌడ్ మిషన్‌ను బలోపేతం చేసేందుకు టీసీఎస్, మేనేజ్‌ఇంజిన్ వ్యూహాత్మక భాగస్వామ్యం! బ్రిటన్ ఏఐ సేఫ్టీ రీసెర్చ్‌ కోసం 250 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించిన ఎన్విడియా ఢిల్లీ పారిశ్రామిక వాడల ఆధునీకరణే లక్ష్యం: రూ. 170 కోట్లతో రహదారులు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శ్రీకారం! అభివృద్ధి పనులకు బ్రేక్‌ పడనివ్వం అనంతపురం నగరంలో రూ.6.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం 12 ప్రాంతాల్లో ఒకేసారి పనులకు భూమి పూజ.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ కెనడా ప్రధాని మార్క్ కార్నీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ సంభాషణ: వ్యూహాత్మక భాగస్వామ్యం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యం!

భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

Select Suryaa Now
భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం

• రఘునాథపురంలో నూతన గృహప్రవేశం

• వేద పండితుడు రవికిరణ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

పామూరు, మేజర్ న్యూస్ : 

 మండలంలోని బొట్లగూడూరు పంచాయతీ పరిధిలోని రఘునాథపురం గ్రామానికి చెందిన కొండా రమణయ్య–పద్మ, కొండా వెంకటేశ్వర్లు–మనోజ్ కుమారి దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం సోమవారం రాత్రి ఘనంగా జరిగింది. మంగళవారం ఉదయం నూతన నివాసంలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. వేద పండితులు కొల్లూరు రవికిరణ్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారి వ్రతానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నూతన గృహంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొని నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  పామూరు సూర్య విలేకరి ఉప్పుగండ్ల రమేష్, మేకల చెంచురామయ్య, మల్లికార్జున్ కొండా రత్తయ్య, కొండా మల్లికార్జున, సోమినేని సురేష్, కరణం గురవయ్య, నల్లూరి బ్రహ్మయ్య, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు